యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

ముద్రా ప్రతినిధి నాగర్ కర్నూల్ : ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి& నాగం జనార్దన్ రెడ్డి  ఆదేశాల మేరకు SSC పేపర్ లీకేజీ విషయాన్ని నీరుగారుస్తూ స్పందించని, శాసనసభ్యుల యొక్క ఆఫీసు ముట్టడిని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు ముట్టడి కార్యక్రమాలు చేయడం జరిగింది,  అందులోని భాగంగానే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు నిరసన సెగను చూపించడం జరిగింది.

అనంతరం పోలీసులు యూత్ కాంగ్రెస్ శ్రేణులను నిరసన కార్యక్రమంలో భాగంగా  అరెస్టులకు పాల్పడడం జరిగింది,  యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ మరిన్ని ఉద్యమాలకు సిద్దమ్ముతున్నామని తెలియజేస్తున్నాము..ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కాటగోని హరీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.