కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా కృషి చేస్తా - కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా కృషి చేస్తా - కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు

ముద్ర, కొల్లాపూర్: నిరుద్యోగులు ఎవరు అధైర్యపడవద్దు.రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా కృషి చేస్తానని కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో  కొల్లాపూర్ ప్రాంత నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమంలో నియమమాకాల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, అమరవీరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేయకుండా, పరీక్షలు రద్దు చేస్తూ, పేపర్ లీకేజీలు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని జూపల్లి విమర్శించారు. నిరుద్యోగ యువతి,యువకులు ఎవరు అధైర్య పడవద్దు అని, నెల రోజుల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా తనవంతుగా కృషి చేస్తానని, నిరుద్యోగ యువతీ యువకులు తల్లిదండ్రులతో పాటు సమాజాన్ని కూడా చైతన్యపరిచి నిరుద్యోగులకు అన్యాయం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు,ఇప్పుడు ప్రభుత్వం మారకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులకు కెసిఆర్ మరింత అన్యాయం చేస్తారని,కొల్లాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి అని వారిని కోరారు.కార్యక్రమంలో  ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకులు కేతూరి వెంకటేష్ ,ఇంద్రకంటి వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.