ఉపాధ్యాయ,అధ్యాపకుల అభ్యర్థులకు నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చేతుల మీదుగ అందుకోనున్నారు

ఉపాధ్యాయ,అధ్యాపకుల అభ్యర్థులకు నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చేతుల మీదుగ అందుకోనున్నారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు :  జిల్లాలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ, అధ్యాపకుల అభ్యర్థులకు నియామక పత్రాలను గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. అందుకుగాను నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులో వారు హైదరాబాదుకు బయలుదేరారు. 

గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం నుండి ఈ బస్సు ఆయా గురుకులాల ప్రిన్సిపల్, ఆర్ సి ఓ లు దగ్గరుండి సాగనంపారు. జిల్లా నుంచి మొత్తం 54 మంది పరీక్షల్లో ఎంపికైన ఉపాధ్యాయ అధ్యాపకుల బృందం బయలు దేరినట్లు మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల ఉమ్మడి జిల్లా ఆర్ సి ఓ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ, అధ్యాపకులకు గురువారం హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిసి గురుకులాల ఆర్ సి ఓ వెంకట్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి ఆయా గురుకులాల అధికారులు నియామక పత్రాలు అందుకొని ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.