జేఈఈ మెయిన్స్ లో మెరిసిన బిజినపల్లి గురుకుల విద్యార్థులు

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన బిజినపల్లి గురుకుల విద్యార్థులు
  • మట్టిలో మాణిక్యాలు
  • గురుకుల విద్యార్థుల అద్భుత ప్రతిభ
  • విద్యార్థుల ను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుమతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బిజినపల్లి మండల కేంద్రము లోని  సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు  జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష లో  అనిల్ 70.54 రామకృష్ణ 62.36 ఉత్తమ ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు. పేదింటి విద్యా కుసుమాలు ప్రైవేట్ కి దీటుగా ర్యాంకులు సాధించడం పట్ల విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుమతి అభినందించారు.  

జేఈఈ మెయిన్స్ పరీక్షల లో బిజినపల్లి సాంఘిక సంక్షేమ  బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుమతి మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం పట్ల  సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ప్రభుత్వ అందిస్తున్న వసతులు ఉపయోగించుకుని గొప్ప విజయాలు సాధించినట్లు తెలిపారు జేఈఈ లో మంచి ఫలితాలు సాధించడంలో విద్యార్థులకు కృషి పట్టుదల ఎంతో ఉందన్నారు తమ అధ్యాపకుల చొరువ తో  బిజినపల్లి గురుకుల పాఠశాలకు కు జిల్లా స్థాయిలో మంచి పేరు గడిచింది అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యార్థులకు తమ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదన్నారు విజయం సాధించిన విద్యార్థులే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.