బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు ప్రభుత్వ విప్, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు సమక్షంలో నేడు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోనికి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, తదితర అభివృద్ధి పనులు చూసే పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమీ అభివృద్ధి చేయలేదని, పార్టీలో నాయకుల వైఖరి నచ్చక పార్టీలోకి వస్తున్నారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలనడం, రైతులకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందని, రైతులకు ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ని సీఎం కేసీఆర్ అందిస్తూ వారికి తోడుగా ఉంటున్నారని, ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి సహకారంగా రూ. ఐదు లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.