బిఆర్ఎస్ గుడ్ బై చెప్పిన ఎంపీ రాములు

బిఆర్ఎస్ గుడ్ బై చెప్పిన ఎంపీ రాములు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: బిజెపిలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు బి ఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పారు గురువారం ఢిల్లీలో బిజెపి జాతీయ నాయకులు ఎంపీ లక్ష్మణ్ మాజీ మంత్రి డీకే అరుణ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు టిఆర్ఎస్ పార్టీ మధ్య గత కొన్నిల్లుగా విభేదాలు నెలకొన్నాయి అచ్చంపేట నుంచి గతంలో అసెంబ్లీకి ప్రాతినిధ్య వహించిన రాములకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో విభేదాలు కొనసాగుతున్నాయి తనయుడు కల్వకుర్తి జడ్పిటిసి భారత్ ప్రసాద్కు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంలో అన్యాయం జరిగిందని ఆవేదన రాములు ఆయన వర్గీయులు నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో రాములకు ఇటీవల కేటీఆర్ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశానికి కూడా ఆహ్వానం పంపలేదు దీంతో రాములు తనకు టీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ రాదని నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా తనకున్న పరిచయాలతో తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో బిజెపి పార్టీ నుంచి టికెట్ ఖరారు హామీతో టిఆర్ఎస్ పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది బిజెపి నుంచి రాములు కు లేదా తనయుడు భరద్ప్రసాద్కు ఎంపీ టికెట్ కేటాయించవచ్చని సమాచారం