ఎం జే ఆర్ ట్రస్ట్ యువతి, యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీ ...

ఎం జే ఆర్ ట్రస్ట్ యువతి, యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీ ...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ నియోజకవర్గ యువతి,యువకులకు, వాహన చోదకులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు అని డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు వాహన చోదకులకు తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించడానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు, ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడనికి అయ్యే ఆన్లైన్ రుసుమును ఎమ్మెల్యే గారు తన MJR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు.

మిగతా ప్రాసెస్ మొత్తం రవాణా శాఖ నియమ నిబంధనలకు లోబడే ఎంపిక చేసి డ్రైవింగ్ లైసెన్స్ యువతి యువకులకు వాహన చోదకులకు,అందజేస్తామని తెలిపారు, ఈ నెల 24 రోజు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు దరఖాస్తు ఫారాలను విడుదల చేసి యువతి,యువకులకు ధరకాస్తు ఫారాలు అందజేయనున్నట్టు తెలిపారు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని యువతీ యువకులు వాహన చోదకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు,మరిన్ని వివరాల కోసం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం - 9618281999,నర్సింహా - 9052601721 ,మహేష్ - 9542399368 నెంబర్లను పోన్ చేసి సంప్రదించగలరని తెలిపారు...