ఎమ్మెల్యేను కలిసిన డిసిహెచ్ఎస్

ఎమ్మెల్యేను కలిసిన డిసిహెచ్ఎస్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జిల్లా ఆస్పత్రి డి సి హెచ్ ఎస్ డాక్టర్ సుగుణాకర్ రాజు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు, జిల్లా ఆసుపత్రి మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యులను స్టేషన్ ఘనపూర్, జఫర్గడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన డీ సి హెచ్ ఎస్ డాక్టర్ పి సుగుణాకర్ రాజు, డాక్టర్ శ్రీకాంత్, రజిని, శోభారాణి, సంగీత, శ్రీధర్, మనోహర్, మల్లేష్, సుమన్ లను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి మంచి వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.