పద్మ కాలనీలో నాలా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్

పద్మ కాలనీలో నాలా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్

ముషీరాబాద్, ముద్ర: ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పద్మకాలనీలో నాలా స్లాబ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎజిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం వరద ముంపు సమస్యలు ఎదుర్కొంటున్న అడిక్మెట్ డివిజన్ పద్మా కాలనీలో పర్యటించారు. స్థానికంగా చేపడుతున్న నాలా స్లాబ్ నిర్మాణం పనులు పరిశీలించారు. పద్మ కాలనీలో వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలాపై చేపడుతున్న స్లాబు పనులు సాగుతున్న తీరును, పనులు వేగంగా చేపట్టడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముంపు సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని రోడ్లపై ఉన్న మట్టి కుప్పలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ నాలా స్లాబ్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి పద్మ కాలనీ వరద సమస్య పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య జిహెచ్ఎంసి ఈఈ శ్రీనివాస్, డిఈ సన్నీ, ఏ ఎమ్ హెచ్ ఓ మైత్రేయి బిఆర్ఎస్ నాయకులు జైసింహ, శ్యాంసుందర్ చిట్టి, రితీష్, అస్లాం, నేత శీను, మాధవ్, మనోహర్, శ్రీకాంత్ యాదవ్ తదితర బస్తీవాసులు పాల్గొన్నారు.