జూపల్లి అరెస్ట్

జూపల్లి అరెస్ట్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: ధాన్యం కొనుగోలులో అవకతవకలపై నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి రైతులతో ర్యాలీగా తరలి తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

దీంతో పరిస్థితి ఉదృతంగా మారింది. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పిన జూపల్లి వినకుండా మొండికేశారు. మండుటెండలో రోడ్డుపై అనుచరులతో కూర్చోవడంతో రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు కలగజేసుకొని జూపల్లిని తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఆయన అనుచరులు అడ్డు తగిలారు దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు జూపల్లి అనుచరులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. జూపల్లిని అరెస్టు చేసి అచ్చంపేట పోలీస్ స్టేషనుకు తరలించారు.  జూపల్లి విడుదల చేయాలంటూ అనుచరులు మరోమారు బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించారు. తర్వాత పోలీసులు కలగజేసుకోవడంతో ఆందోళన విరమించారు.

తాగునీరు, సాగునీటి శాశ్వత పరిష్కారానికి గోదావరి నదిపై కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడంతో పాటు రాష్ట్రంలో 44 వేల చెరువులను మిషన్ కాకతీయ పేరుతో పటిష్టం చేయడంతో ఎండాకాలంలో మత్తల్లు పడడమే కాదు.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. సాగునీరు, కరెంటు, రవాణా, గురుకులాలు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్‌‌ కిట్ తోపాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో మారు ప్రజలు పట్టం కడతారన్నారు.

సిట్టింగ్‌లకే టిక్కెట్లు అని సీఎం చెప్పినప్పటికీ సర్వేలు ప్రామాణికం అవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే రాజయ్యకు కార్యకర్తలు అండదండగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ప్రజా సేవకు అంకితమవుతానని, కార్యకర్తలే తన బలం, బలగం అన్నారు. సమావేశంలో ఎంపీపీలు రేఖాగట్టయ్య, సుదర్శన్, జడ్పీటీసీ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, ఆకుల కుమార్, మాచర్ల గణేష్, ఉడుగుల భాగ్యలక్ష్మి, కనకం స్వరూప, నగర బోయిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.