జిల్లాలోని 18 పోలీస్  స్టేషనులకు పదో తరగతి ప్రశ్నపత్రాల తరలింపు

జిల్లాలోని 18 పోలీస్  స్టేషనులకు పదో తరగతి ప్రశ్నపత్రాల తరలింపు

జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి పోలీస్ బందోబస్తు.
నాగర్ కర్నూల్,ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి  జిల్లాలోని 18 పోలీస్ స్టేషన్ లకు పదోతరగతి ప్రశ్నపత్రాలను శనివారం పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రశ్న పత్రాలు చేరుకోగా ఎస్పీ కార్యాలయ స్ట్రాంగ్ రూము నుంచి  శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు నేతృత్వంలో పోలీసు మరియు రెవిన్యూ అధికారుల సమక్షంలో 6 రూట్లలో జిల్లాలోని 61 పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను 18 పోలీస్ స్టేషన్లకు తరలించి పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూముల్లో పదో తరగతి పరీక్షల కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ భద్రపరచనున్నట్లు  డీఈవో వెల్లడించారు.

ఆయా సబ్జెక్టుల పరీక్షల రోజు ఆయా సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలను మాత్రమే ఉదయం 8:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు , డిపార్ట్మెంటల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు పేపర్లను తరలించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు, రూట్ అధికారులు శంకర్ నాయక్, భాస్కర్ రెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.