సైబర్ నెరగాల కొత్త మోసాలు

సైబర్ నెరగాల కొత్త మోసాలు

నాగర్ కర్నూల్ లో పలువురు అకౌంట్లు డబ్బు మాయం ఖాతాదారుల ప్రమేయం లేకుండానే డబ్బులు విత్ డ్ర రూ. లక్షల్లో డబ్బులు మాయం కావడంపై ఆందోళన పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు, కేసు నమోదు.. సైబర్ నెరగల్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు ఆయా బ్యాంక్ ఖాతాదారులు ప్రమేయం లేకుండానే తమ అకౌంట్లో నుండి 10,000 రూపాయల వరకు మాయం చేస్తున్నారు. వారి అకౌంట్లో నుంచి డబ్బులు వితట అవుతున్న విషయం సెల్ఫోన్ మెసేజ్ అందకపోవడంతో ఖాతాదారులు ఆలస్యంగా చేరుకుంటున్నారు ఖాతాదారులు ఆయా బ్యాంకు మేనేజర్లు వద్ద ఫిర్యాదు చేయడంతో విత్ డ్ర అవుతున్న  సమాచారం.

తమ వద్ద లేదని చెప్పడంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా ఇప్పటికే పది మంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం. అందరూ గత మూడు నెలల క్రితం నాగర్కర్నూల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆయా భూముల క్రియాభిరాల్లో సాక్షాలుగా వేలిముద్రలు వేసిన వారు అయి ఉండటం విశేషం సైబర్ నేరగాళ్లు రిజిస్టర్ కార్యాలయాల నుండి డాక్యుమెంట్ వివరాలు ఆధారంగా ఆధార్ నెంబర్లు సాయంతో వేలిముద్రలు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మినీ బ్యాంక్ ఆధారంగా విత్డ్రా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు