రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన సన్మార్గంలో  విద్యార్థులను నడిపించాలి - డీఈఓ గోవిందరాజులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన సన్మార్గంలో  విద్యార్థులను నడిపించాలి - డీఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి:భారత రాజ్యాంగ నిర్మాత  డా.   బి.ఆర్. అంబేద్కర్ చూపిన సన్మార్గంలో ప్రతి విద్యార్థిని నడిపిస్తూ,   నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు కంకణ బద్ధులై పనిచేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు  అన్నారు. డాక్టర్ భీం రావు అంబేద్కర్  132 వ జయంతిని పురస్కరించుకొని గురువారం నాగర్ కర్నూల్ లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి ఆయన అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.

డిఇఓ, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఇఓ డాక్టర్ గోవిందరాజులు  మాట్లాడుతూ...  ప్రతి మనిషి అభ్యునతికి విద్యతోటే ముడిపడి ఉందని తెలిసిన  మహానుభావుడని గుర్తు చేశారు.  కేవలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే కాకుండా భారత దేశంలోని ప్రతి ఒక్క వర్గానికి  సమన్యాయం చేసుకుంటూ రాజ్యాంగంలో పొందుపర్చారని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణంలో బాబాసాహెబ్ ప్రాధాన్యత ఎంతో ఉందని  తెలియజేసారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో దేశ సమూల అభివృద్ధికై  రచించిన రాజంగాన్ని ఇప్పటికి ఆచరిస్తూ, భవిష్యత్తులోనూ కొనసాగించడం జరుగుతుందన్నారు.

ప్రతి విద్యార్థి రాజ్యాంగం పట్ల భక్తిశ్రద్ధలతో ఉండేలా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు రాజ్యాంగ విలువల పాఠాలను నేర్పాలన్నారు.  అయన వేసిన బాటలో దేశం పురోగ మిస్తున్నదని , అంబెడ్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కంకణ బద్ధులై, ప్రతి విద్యార్థి ఉజ్వలమైన భవిష్యత్ అందించి, అయన ఆశయాలను  ఉపాధ్యాయ లోకం ముందుకు తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా డిఇఓ ఉపాధ్యాయులను  కోరారు. ఈ కార్యక్రమం లో ఏసీ రాజశేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజ్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లు శెట్టి, డి సి ఈ బి సహాయ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్ జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూర్య శ్రీనివాస్ గౌడ్, రామచందర్రావు, మద్దిలేటి, ఉపాధ్యాయులు వివిధ సంఘాల నాయకుల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.