ఆర్బిఎస్కేలో మెడికల్ ఆఫీసర్లుగా ఆయుష్ డాక్టర్ల దరఖాస్తులకు ఆహ్వానం - జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్

ఆర్బిఎస్కేలో మెడికల్ ఆఫీసర్లుగా ఆయుష్ డాక్టర్ల దరఖాస్తులకు ఆహ్వానం - జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్

రాష్ట్రీయ బాలస్వాస్థ్య (ఆర్.బి.యస్.కే) కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 9 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జిల్లాలో అర్హత కలిగిన ఆయుష్ డాక్టర్లు  దరఖాస్తులు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, నాగర్ కర్నూల్ వారి ఆదేశానుసారము జిల్లాలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమము (RBSK) కింద ఈ దిగువ తెలిపిన ఉద్యోగాలను ఒక సంవత్సరం కొరకు కాంటాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు MBBS & ఆయుష్ వైద్యాధికారి (పురుషులకు 04 ) MBBS & ఆయుష్ వైద్యాధికారి (మహిళలకు 5) అర్హత కలిగిన అభ్యర్తులు దరఖాస్తు చేసుకొనుటకు వివరాలకు "www.nagarkurnool.telangana.gov.in " వెబ్ సైట్నం దు దరఖాస్తులు చేసుకుని, నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెండు అంతస్తులోని యస్ 26 నెంబర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము యందు దరఖాస్తు చేసుకొనుటకు నేటి నుంచి ఈ నెల 13వ సాయంత్రం 5.00 గంటల వరకు. (ఆన్ని పని దినాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.