సలేస్వరం జాతర భక్తులకు ఇక్కట్లు

సలేస్వరం జాతర భక్తులకు ఇక్కట్లు

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: అమరాబాద్ నల్లమల్ల లోతట్టు అడవి ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలు ఈనెల ఐదు నుండి 8 వరకు జరుగుతాయని అటవీశాఖ అధికారులు ముందుగా ప్రకటించినప్పటికీ ఈనెల 4 నుండే భక్తులు పెద్ద ఎత్తున సలేశ్వరం జాతరకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చారు. అడవిలో కి వెల్లుటకు భక్తులకు  అనుమతి లేదని అటవీ శాఖ అధికారులు వారిని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఫరహాబాద్ వద్ద నిలిపివేయడంతో ఆందోళన చేపట్టారు. భక్తులకు  ఈ నెల ఐదు నుండి ఏడు వరకు మూడు రోజులు మాత్రమే జాతరకు అనుమతి ఉందని మిగతా రోజులలో లేదని అధికారులు వారిని ఆపడంతో రోడ్డుపై ఆందోళన చేపట్టారు భక్తులు. దీనితో రహదారి వెంట పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరిగిందని జాతరకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.