నాగర్ కర్నూల్ జిల్లా  మెడికల్ కాలేజీలో మహిళా వర్కర్ పై సూపర్వైజర్ మహేష్ అత్యాచారయత్నం..

  • సాయి యేజెన్సి ఆఫీస్ క్లినిక్ కి పిలిచిన సూపర్ వైజర్ మహేష్..
  • ఆఫీస్  క్లీన్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్ననికి ప్రయత్నించిన మహేష్.. 
  • ప్రతిగ్నటించి బయటకు వచ్చిన బాధిత మహిళ..
  • నిన్న సాయంత్రం సంఘటన,  ఆలస్యంగా వెలుగులోకి..
  • మెడికల్ కాలేజ్ ఎదుట తోటి కార్మికులతో కలిసి  బైఠాయించి నిరసన తెలిపిన బాధితురాలు..
  • సూపర్వైజర్ ను దేహశుద్ధి చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మెడికల్ కళాశాలలో స్వీపర్గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళపై సూపర్వైజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాలలో వెలుగు చూసింది. స్వీపర్గా పనిచేస్తున్న ఆమె రోజు లాగే మెడికల్ కళాశాల ప్రాంగణంలో పనులు ముగించుకొని గురువారం సాయంత్రం హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్యాలయంలోనూ శుభ్రం చేసేందుకు వెళ్లింది.

కాగా అక్కడే బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మహేష్ (28) సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. కాగా తనపై కన్నేసి కార్యాలయానికి లోపల నుంచి గడియ పెట్టి ఆమెను బలవంతం చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన ఆమె అరుపులు కేకలు వేస్తూ కార్యాలయ తలుపులు తీసుకొని బయటకు పరుగులు తీసింది అనంతరం తోటి వారితో చెప్పుకోవడంతో శుక్రవారం మహేష్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అనంతరం ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల గేటు ముందు స్వీపర్లంతా ధర్నా చేశారు. కానీ చివరికి పోలీస్ స్టేషన్ వేదికగా బాధితురాలని బెదిరిస్తూ కేసు నమోదు చేయకుండా రాజీ కుదుర్చే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.