గ్రూప్ 1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

గ్రూప్ 1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు:  జిల్లాలో జరిగే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
  పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు  వెల్లడించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, 5130 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 19 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని, నాగర్ కర్నూల్ లో 11, అచ్చంపేటలో 3 కల్వకుర్తిలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలు పాటించాలని తెలిపారు.


1. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావాల్సి ఉంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు.
2.ఉదయం 8.15 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి పడుతుంది. 
ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరిని పరీక్షా కేంద్రంలో కి అనుమతి బడదు.
3. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తమ బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్,హాల్ టికెట్‌తో పాటు ఏదేని గుర్తింపు కార్డును మాత్రమే తీసుకు రావాల్సి ఉంటుంది.  
4. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, హెడ్ ఫోన్స్, బ్యాగులకు అనుమతి ఉండదు. 
5. అభ్యర్థులను ముందుగా క్షుణ్ణంగా తనీఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రానికి అనుమతించబడుతుంది.
6. దివ్యాంగులకు పరీక్ష రాసే అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీచేసిన పత్రాలతో పరీక్షా కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
7. కొంతమంది అభ్యర్థుల హాల్ టికెట్ లపై ఫోటో ప్రింట్ మిస్ అయితే అలాంటి అభ్యర్థులు మూడు పాస్పోర్ట్ సైజ్  ఫోటోలు వెంట తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు.