శశిధర్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలి.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు 

శశిధర్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలి.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు 

కోదాడ, ముద్ర: బిఆర్ఎస్ పార్టీ నాయకులు  శశిధర్ రెడ్డికి అంతా మంచి జరగాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో కోదాడ బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇంచార్జీ  కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ముఖ ద్వారం కోదాడ  నియోజకవర్గంలో శశిధర్ రెడ్డి తెలంగాణ సాధనకు చేసిన కృషిని వారు ప్రశంసించారు. అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో శశిధర్ రెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. కేక్ కట్ చేసి శశిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్  పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు , అనంతగిరి జెడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి ,చిలుకూరు జడ్పిటిసి బోలిశెట్టి శిరీష నాగేంద్రబాబు , చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, నడిగూడెం జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు, మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ , కోదాడ మున్సిపల్ కౌన్సిలర్స్ గుండపనేని పద్మ నాగేశ్వరావు, సుశీల రాజు, పెండేం వెంకటేశ్వర్లు, బేతవోలు సర్పంచి వట్టికూటి చంద్రకళ నాగయ్య , కోదాడ మండలం మాజీ జడ్పిటిసి గరిన కోటేశ్వరరావు, చిలుకూరు మండలం మాజీ ఎంపీపీ టి రామయ్య , టిఆర్ఎస్ పార్టీ కోదాడ మండల మాజీ అధ్యక్షులు బాషాబోయిన భాస్కర్ రావు, దండ వీరభద్రం , నడిగూడెం మండల వైస్ ఎంపీపీ బడేటి  వెంకటేశ్వర్లు, నారాయణపురం, చిలుకూరు మాజీ జెడ్పిటిసి పుల్లూరు అచ్చయ్య ,  పిఎసిఎస్ మాజీ చైర్మన్ రామ్ రెడ్డి , సుదర్శన్ రెడ్డి , చిమిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి ,రావి రవి, మండల సైదులు, ఎంపీటీసీలు వట్టికూటి ధన మూర్తి , సైదా బాబు, ఎంపీటీసీ మద్ది పద్మ వెంకట రెడ్డి , ఒక్కమంతుల విజయ్ కుమార్ , గొండ్రియల మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు , కర్కారగూడెం సర్పంచ్ నూకల యుగంధర్ రెడ్డి , కాసాని వెంకన్న, పాండవుల కృష్ణ, షేక్ హసన్ అలీ , తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు