రామాలయం నిర్మాణం పై గ్రామంలో ఉద్రిక్తత

రామాలయం నిర్మాణం పై గ్రామంలో ఉద్రిక్తత

బి ఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ

ముద్ర, హుజూర్ నగర్: హుజూర్నగర్ మండల పరిధిలోని కరక్కాయల గూడెం గ్రామంలో రామాలయం పునర్నిర్మాణంలో భాగంగా బి ఆర్ఎస్ ,కాంగ్రెస్ వర్గాల మధ్య బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పునర్నిర్మాణ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి.  కరక్కాయల గూడెంకు చెందిన పిల్లుట్ల వెంకయ్య కుటుంబ సభ్యులు 170 గజాల స్థలాన్ని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు.  అదే గ్రామానికి చెందిన మరో దాత ఆలయ నిర్మాణానికి 23 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలోని రెండు పార్టీల నాయకులు కలిసి కూర్చొని మాట్లాడాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కిత జయమ్మ ధన మూర్తి ఆధ్వర్యంలో భాగంగా సోమవారం నాడు వందల నాటి దేవాలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు.

కాంగ్రెస్ కి చెందిన మాజీ సర్పంచి దొంగరి వెంకటేశ్వర్లు, దొంగరి సత్యనారాయణ, అరుణాలు అనుచరులతో కూల్చివేత కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.  ఇరు వర్గాల మధ్య ఘర్షణ చేసుకుని ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరువు వర్గాల మధ్య రాజి కుదిరించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ వర్గీయులు రామాలయ  నిర్మాణానికి జూన్ 8న శంకుస్థాపన చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం శ్రావణం, లేదా కార్తీక మాసంలో మంచి ముహూర్తం చూసి గుడి నిర్మాణం చేయాలని పట్టుబడుతున్నారు.

ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరుతో గుడిని నిర్మాణం రాజకీయ ఆధిపత్యం. బుధవారం నాడు పోలీసుల సహకారంతో అధికార పార్టీ నాయకులు రామాలయాన్ని కూల్చివేస్తారని సమాచారంతో పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరుకున్నారు దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణం లేదా కార్తిక మాసంలోనే మంచి ముహూర్తాలు చూసి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ వర్గీయులు పట్టుబడుతున్నారు.  ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం జూన్ 8 లేదా 14వ తేదీలో శంకుస్థాపన చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయ పున్న నిర్మాణం పై రెండు పార్టీల నాయకులు పట్టు పట్టడంతో గ్రామంలో రాజకీయ పరిస్థితులు ఏర్పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.