జీలుగు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి

జీలుగు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి

మద్దిరాల ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై జీలుగు విత్తనాలు అందజేయుచున్నారని మండల వ్యవసాయ అధికారి వికాస్ పాటిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రోస్ లో పచ్చిరొట్ట ఎరువుల అమ్మకాలు దుకాణం  జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ ఏ రజాక్ తో కలిసి ప్రారంభించారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుసంక్షేమమే ద్వేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది అని అన్నారు. పచ్చిరొట్ట ఎరువుల భూ సాంద్రత పెరిగి అధిక దిగుబడులు వస్తాయని అన్నారు.  2407 రూపాయల విలువగల విత్తనాల బ్యాగ్  842 రూపాయల కు లభిస్తుంది అన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సరోజ ఏ ఈ ఓ లు అనూష ,రాజేష్, వడ్డాణం రవీందర్ పలువురి రైతులు పాల్గొన్నారు