అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ వెంకట్రావు

అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ వెంకట్రావు
  • పరేడ్ గ్రౌండ్ ను పరిశీలన.
  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
  • వాటర్ ప్రూఫ్ శమియనాలు ఏర్పాటు చేయండి.
  • జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జూన్2 రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం  యస్.పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ లతో కలసి  పరేడ్  గ్రౌండ్ ను  పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రౌండ్ కలియ తిరిగి , ఏర్పాటు చేసిన స్టేజి, విఐ పి, వివిఐపీ గ్యాలరీలు అమరవీరుల స్తూపం పరిశీలించారు.  వేసవి దృష్ట్యా శమియానాలు, నిరంతర విద్యుత్, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ స్టాల్ అలాగే అన్నిశాఖల స్టాల్స్, ఏర్పాటు చేయాలని అలాగే శకటాలు ముందుగానే గ్రౌండ్ లో రప్పించాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు , సిబ్బంది చేపట్టబోయే కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కార్యక్రమంలో ప్రొటోకాల్ తప్పక పాటించాలని వచ్చే పుర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ కిషోర్ కుమార్, పి.డి. కిరణ్ కుమార్, డి.యస్.పి. నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.