రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి- తాటికొండ సీతయ్య

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి-  తాటికొండ సీతయ్య

తుంగతుర్తి ముద్ర: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొని పండుగ వాతావరణం లో దశాబ్ ఉత్సవాలను జయప్రదం చేయాలని బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ దశాబ్ది ఉత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు ముగిసి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. జూన్ రెండవ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనాలని అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు దీంతో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.

దళిత బంధు. రైతు బీమా. షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు. కేసీఆర్ కిట్టు. 24 గంటల కరెంటు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీరు. తదితర సంక్షేమ పథకాలు అమలు తీరుతెనులను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రగతి అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు. గ్రంధాలయ కమిటీ చైర్మన్ గోపగాని రమేష్. గోపగాని శ్రీనివాస్. తడకమల రవికుమార్. శ్రీను. తదితరులు పాల్గొన్నారు.