తుంగతుర్తి గ్రంథాలయంలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

తుంగతుర్తి గ్రంథాలయంలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

తుంగతుర్తి ముద్ర:-ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను తుంగతుర్తి గ్రంధాలయంలో గ్రంథాలయ చైర్మన్ గోబగాని రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం డిసిసిబి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ కాళోజి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ భాష, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. తెలుగు భాషే మన అస్తిత్వమని ఎలుగెత్తి చాటిన కవి బహుభాషా కోవిదుడు కాళోజీ నారాయణరావు అన్నారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ చిరస్మరణీయులని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్లు ఉప్పుల నాగమల్లు, ఎనగందుల అఖిల్, వార్డు సభ్యులు కటకం సూరయ్య, బత్తుల జలంధర్, తడకమల్ల రవికుమార్, చెరుకు పరమేష్, సాయికిరణ్, ఎల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.