ప్లాస్టిక్ ఇటుకలు టైల్స్ పై ప్రచారం చేయాలి -  జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ప్లాస్టిక్ ఇటుకలు టైల్స్ పై ప్రచారం చేయాలి -  జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ప్లాస్టిక్ తో తయారు చేసే ఇటుకలు, టైల్స్ పై ఎక్కువ ప్రచారం జరగాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  పట్టణంలోని జమున నగర్ కంపోస్టు యార్డ్ ను తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్టు యార్డ్ ద్వారా హెచ్.డి పైప్ లకు ఎక్కువగా  రా మెటీరియల్  అందించాలని సూచించారు. రా మెటీరియల్ తయారు విధానం ఇటుకలు, టైల్స్ లను  పరిశీలించి సిబ్బందిని అభినందించారు. అదేవిదంగా వర్మీ కంపోస్టు విధానం ను పరిశీలించి మెళకువలు పాటించాలని తెలుపుతూ కంపోస్టు ఎరువు మరింత ఉత్పత్తి అయ్యేలా చూడాలని తెలిపారు.

 కుక్కల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి పట్టణంలోని వీదుల్లో తిరుగుతున్న కుక్కలను సంరక్షణా కేంద్రానికి తరలించాలని అలాగే  పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ విధానాన్ని తప్పక అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కేసారం, ఇందిరమ్మ ఫేస్ 3 లలో గల రెండు పడకల ఇండ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.