రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ముద్ర,  కుషాయిగూడ: బైక్ అదుపుతప్పి కింద పడటంతో.... తీవ్ర గాయాలతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం... రామంతపూర్ లో నివసించే జనగాం చెందిన నవీన్ (23), మౌలాలిలో నివసించే క్రాంతి (23) విద్యార్థులు. స్నేహితులైన వీరిద్దరూ ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో టీఎస్ 02 ఎఫ్ డి 3837 ద్విచక్ర వాహనంపై మౌలాలి నుంచి ఈసీఐఎల్ వైపు వస్తున్నారు. అతివేగంగా వస్తున్న వీరు బైకు ఈసీఐఎల్ చౌరస్తాలోని మలుపు వద్ద అదుపుతప్పి కింద పడింది. దీంతో తలకు , శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.