గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి ...

గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి ...

చింతలపాలెం,ముద్ర:-మండల కేంద్రంలోగ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ,రాస్తారోకో లో వివిధ పార్టీలు  సంఘీభావం సోమవారం తెలిపారు  కాంగ్రెస్ పార్టీ నుండి పాల్గొన్న మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయితీ సిబ్బంది కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని, వారికి గౌరవ వేతనం చెల్లించాలని & ప్రమాద బీమా వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఉస్తెల నారాయణరెడ్డి, మండల కార్యదర్శి చింతిరాల రవి, జీయలుద్దిన్, అబ్ధుల్ బాషా,MRPS జిల్లా నాయకులు బాలచంద్రుడు, మండల నాయకులు రమేష్ సీపీఎం మండల నాయకులు సుందరమౌలేశ్వర్ రెడ్డి, జంగాల పుల్లయ్య , పంతులు జానిమియ పాల్గొన్నారు.