సెకండ్ క్యాటగిరి ఏ ఎన్ ఎం ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి

సెకండ్ క్యాటగిరి ఏ ఎన్ ఎం ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి

తుంగతుర్తి ముద్ర:-వైద్య ఆరోగ్య శాఖలో  సెకండ్ ఏ ఎన్ ఎం లుగా పనిచేస్తున్న ఉద్యోగులును క్రమ బద్దీకరించాలని కోరుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రావులపల్లి పీహెచ్సీ సిబ్బంది తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆసుపత్రి  ముందు నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సెకండ్ ఏ ఎన్ ఎం ఎర్ర భారతి మాట్లాడుతూ గత పదిహేను సంత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏ ఎన్ ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని  ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ,ఏ ఎన్ ఎం పరీక్ష లను రద్దు  చేసి వెయిటే జీ మార్కులు 30 కి పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సెకండ్ ఏ ఎన్ ఎం లు జయమ్మ, రూప, కమల,స్వప్న, స్వాతి,రజిత,బేబీ లు పాల్గొన్నారు.