రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి - డీఈఓ గోవిందరాజులు

రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి - డీఈఓ గోవిందరాజులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను డిఈవో గోవిందరాజులు ఆదేశించారు. బిజినపల్లి మండలంలోని మంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం డిఈవో గోవిందరాజులు ఆకస్మిక తనిఖీ చేశారు.

పాఠశాలలో విద్యార్థులకు అమలుపరుస్తున్న ఎఫ్‌ఎల్‌, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలపై ఉపాధ్యాయులతో సమీక్ష  నిర్వహించారు.విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘లక్ష్య’ కార్యక్రమంలో నిర్ధేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో తరగతి గదిలో అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, చదువు పట్ల ఆసక్తి పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి గురించి చర్చించాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రానున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సబ్జెక్టు ఉపాధ్యాయులను డీఈవో ఆదేశించారు.