సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి  నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టౌన్,మరియు అన్ని మండలాల క్లస్టర్ ఇంచార్జిలతో కలిసి జూన్ 6వ తేదీన నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్  పర్యటన సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి,ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జూన్ 6వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, BRS పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారని తెలిపారు.

2016 దసరా రోజున నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిందని అన్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ సాకారం చేశారని పేర్కొన్నారు. గతంలో తాను ఇచ్చిన జిల్లా ఆవిర్భావం హామీని అమలుచేసి, కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభానికి సీఎం రావడం సంతోషకరమని అన్నారు.సీఎం రాక సందర్భంగా భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ కి ఘనంగ సత్కరించి దన్యవాదాలు తెలపాలన్నరు, దేశంలో తెలంగాణ రాష్ట్రన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సీఎం కేసీఆర్ మన నాగర్ కర్నూల్ వస్తున్నందుకు ప్రజలందరూ ఆయనకు ఘనంగ స్వాగతం పలికేందుకు స్వచందంగ ముందుకు వస్తున్నారు అని అన్నారు, ఈ కార్యక్రమంలో టౌన్,అన్ని మండలాల క్లస్టర్ ఇంచార్జిలు అందరూ పాల్గొన్నారు...