పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు

పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు

 మంత్రి గంగుల కమలాకర్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పదేండ్ల జిల్లా ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ' పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల పై జిల్లా అధికారులతో మంత్రి   సమావేశం నిర్వహించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను అధికారులకు వివరించారు. మండల, నియోజకవర్గం, జిల్లా వారిగా నిర్వహించే ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతీ శాఖ పదేండ్ల ప్రగతి నివేదిక అభివృద్ధి పథకాలపై ప్లెక్సీ, సక్సెస్ స్టోరీ, ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ, పల్లె, పట్టణాలలో, కార్యాలయాలలో విద్యుత్ దీపాలను వెలిగించాలని సూచించారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సభ లు ఏర్పాటు చేయాలని అన్నారు.

అనంతరం కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న అవతరణోత్సవ వేడుకలు, 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5 న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూర చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు,10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణా రన్, 13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరోగ్యం, 15 న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీలా పండుగ, 19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం చివరగా జూన్ 22న అమరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ చైర్మన్  రవీందర్ సింగ్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్,  అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్,  జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ బిటి రోడ్లకు మహర్దశ 

కరీంనగర్ పట్టణంలో వర్షానికి ధ్వంసమైన బీటీ రోడ్డు నిర్మాణ పనులను 1కోటి 11లక్షలతో పునరుద్ధరిస్తున్నట్లు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం బద్దం ఎల్లారెడ్డి చౌరస్తాలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి   బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించి  పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం అని అన్నారు.. గతంలో ఎన్నడు లేని విధంగా నగరంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ ఈ నాగ మల్లేశ్వర్ రావు  ,ఆర్&బి ఈఈ సాంబ శివరావు , డిఈ రవీందర్ ,ఏఈ లక్ష్మణ్ రావు, కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్, గుగ్గిళ్ళ జయశ్రీ -శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్ కుమార్, కొలిపాక శ్రీనివాస్, రవి నాయక్, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.