చిగురుమామిడి దవాఖానకు కాయకల్ప అవార్డు

చిగురుమామిడి దవాఖానకు కాయకల్ప అవార్డు

వైద్య సిబ్బందిని అభినందించిన ఎంపీపీ

చిగురుమామిడి ముద్ర న్యూస్: దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కాయకల్ప అవార్డులు అందిస్తుంది. ఇందులో భాగంగా 2022 - 23 సంవత్సరానికి గాను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం "బెస్ట్ పీహెచ్‌సీ" కాయకల్ప అవార్డును గెలుచుకుంది. స్వచ్చ భారత్ అభియాన్,హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ అదుపు చేయడం, మెరుగైన ఆరోగ్య సేవలు,  హాస్పిటల్ పరిసరాల పరిశుభ్రత పాటించడం, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో చిగురుమామిడి దవాఖాన 85.30 శాతం మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానం దక్కించుకుంది.

బెస్ట్ పీహెచ్‌సీ  అవార్డుతో పాటు 2 లక్షల రివార్డు అందుకోనుంది. ఈ అవార్డుతో మండలానికి మంచి పేరు వచ్చిందని ఇందుకు కృషిచేసిన  మండల వైద్యాధికారి, సిబ్బందికి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలిపారు. అవార్డు వచ్చిన సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు రావడానికి సహకరించిన  జిల్లా కలెక్టర్  కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ,జిల్లా వైద్యాధికారి  డాక్టర్ శ్రీ లలితా దేవీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ  డా.జువెరియకు  ధన్యవాదములు తెలిపారు.అలాగే పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి  తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ఎన్‌క్యూఏఎస్‌   సర్టిఫికేషన్‌ కూడ గెలుచుకుoటమని, తద్వారా మండల ప్రజలకు మరింత అరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.