అధికారుల నిర్లక్ష్యం తెరుచుకొని కార్యాలయం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల కార్యాలయాలు ప్రారంభంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశిస్తే అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. జిల్లా కేంద్రంలోని మెడికల్ షాపులలో లభ్యమవుతున్న మందులను పరిశీలించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో మేరకు విక్రయిస్తున్నారా లేదా గమనించడం నూతన షాపులకు అనుమతులను మంజూరు చేయడం లాంటి పనులతో పాటు ఫార్మసిస్టులే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారా లాంటి అంశాలను పరిశీలించవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల కార్యాలయాన్ని నిబంధనల సమయం మేరకు తేరవడంలేదని తెలుస్తుంది సోమవారం 12:30 గంటలు దాటిన కార్యాలయం తెరవకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మెడికల్ షాపులలో నిర్వాహకులు ఇష్టానుసారంగా మందులను విక్రయిస్తూ రోగులను దోచుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధన మేరకు విధులను నిర్వహిస్తూ ప్రజలను కాపాడాలని కోరుతున్నారు