కాంగ్రెస్ లో లుకలుకలు

కాంగ్రెస్ లో లుకలుకలు
  • మాజీ మంత్రి వర్సెస్ మాజీ ఎంపి? 
  • పాదయాత్ర లో కనిపించని నాగం
  • యువ నేత చేరిక పై ఎదురుచూపులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీలో లుకలుకలు అధికంగా ఉండే అవకాశం ఉండేది నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిల మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నప్పటికీ ఎక్కడ లేని విధంగా నియోజకవర్గం లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి ఎన్నికలకు  మరో ఐదు నెలల సమయం ఉన్న పరిస్థితుల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ మల్లురవిల మధ్య విభేదాలు పొడి చూపినట్లు తెలుస్తుంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఆశించిన మేర జనం కదిలి రాకపోవడంతో ఆ పార్టీలో విభేదాలు ఉన్నట్లు గుసగుసలాడుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర ముగించుకొని జిల్లాలోని నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ప్రాంతంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి కొంతమేర పాదయాత్రలో పాల్గొన్నారు సొంత నియోజకవర్గంలో నాలుగు రోజులుగా పాదయాత్ర కొనసాగుతున్న ఆయన పాల్గొనకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర మొత్తం రూపకల్పన నుండి విజయవంతం చేసేందుకు పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి కసరత్తు చేపడుతున్నారు పాదయాత్ర రూపకల్పనలో మాజీ మంత్రి నాగం అభిప్రాయం తీసుకోకపోవడం పట్ల ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది నియోజకవర్గంలో మళ్లీ రవి వర్గీయులుగా పేరుపొందిన కొందరు పాదయాత్రలో పాల్గొంటూ ముందుకు సాగుతుండగా నియోజకవర్గ నేత పాల్గొనక పోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాజీ మంత్రి నాగం ప్రధాన అనుచరులు కొందరు మాత్రం పాదయాత్రలో పాల్గొంటున్నారు వీరు కూడా పాదయాత్రలో కొంత అంటి ముట్టనట్లుగానే పాల్గొంటున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహగానాలు వెలువడుతున్న తరుణంలో పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా మాజీ మంత్రి తీసుకొని విజయవంతం చేస్తారని ఊహించినప్పటికీ మాజీ మంత్రి ఆశించిన స్థాయిలో ముందుకు కదలక పోవడం పట్ల మల్లు రవి వర్గీయులు కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం రాజేష్ రెడ్డి ని పార్టీలో చేరాలి తామంతా అండగా ఉంటామని కోరినట్లు తెలుస్తుంది మరో రోజులో నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకొని అచ్చంపేట నియోజకవర్గం లో పాదయాత్ర అడుగుపెట్టనుంది.

ఇరువురి మధ్య ఉన్న లుకలుకలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని సొంత పార్టీలోనే క్యాడర్ చర్చించుకుంటున్నారు జడ్చర్ల లో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తారని ఆశించినప్పటికీ ఆయనకు అవకాశం దక్కకపోవడం ఆయన వర్గీల్లో నిరాశ మిగిల్చిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగించిన సందర్భంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో పాటు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడుతున్న 75 సంవత్సరాల వయసు కలిగిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి లాంటి వారు పార్టీలో ఉన్నారని ప్రస్తావించడంతో ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు మరికొద్ది రోజులు పడుతుంది