రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు పనికిమాలిన చర్య ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు పనికిమాలిన చర్య ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా  : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల మాటలు వింతగా ఉన్నాయన్నారు. రైతుబంధు పథకంపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు విడ్డూరంగా ఉందని రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ దగాపడ్డ్ రైతాంగానికి 24గం.ల కరెంటు, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, దేశంలో లేని రైతుబంధు పథకం అమలు చేశారని చెప్పారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇవ్వాలంటే గుర్రాలతో తొక్కించి పోలీసులతో కొట్టించిన ఘన చరిత్ర వారిదని అన్నారు.11విడతలుగా రైతుబంధు ఇస్తున్నాం కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని ఆపాలని ఫిర్యాదు చేయడం దుర్మార్గం అన్నారు.రేవంత్, ఉత్తమ్ చీము నెత్తురు ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే లేఖ ఉపసంహరించుకోవాలి చెప్పారు.రైతుల్లారా కాంగ్రెస్ నమ్మకండి జాకీ పెట్టినా కాంగ్రెస్ లేవదని విమర్శించారు.డబ్బులిస్తే టిక్కెట్లు ఇచ్చే కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు దోచుకోవడమే కాంగ్రెస్ నైజం అని విమర్శించారు.

పొరపాటున కాంగ్రెస్ కు అధికారం వస్తే పేదల భూములు ఉండవు అందుకే ధరణి తీసేస్తామంటున్నారని అన్నారు.బీజేపీ బండి సంజయ్ లా భవిష్యత్తులో రేవంత్ కనిపించకుండా పోతారని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానని అన్నారు.దామోదర్ రెడ్డి 6సార్లు ఓడిపోయారు...రాజేష్ రెడ్డి కూడా ఓడటం ఖాయం అన్నారు.ఎన్నికల తర్వాత కనిపించకుండా పోతారని విమర్శించారు.నాగర్‌కర్నూల్ పై రాజేష్ రెడ్డికి ఏమీ అవగాహన లేదన్నారు.సిఈఓ అంటే ప్రజల జీతగాడు...ఇది కూడా తెలియదా ప్రతిపక్షాల కన్నారు.నాగర్‌కర్నూల్ ప్రజలకు జీతగాడిగా సేవ చేశాను త్వరలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది అన్నారు.