ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి - డాక్టర్ డిఈఓ గోవిందరాజులు

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి - డాక్టర్ డిఈఓ గోవిందరాజులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ఉపాధ్యాయులు తమ విద్యార్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసి ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తూ మార్గనిర్దేశం చేసి రోల్ మోడల్స్ గా వ్యవహరించాలని డిఇఓ గోవిందరాజులు అన్నారు.గురువారం బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను డీఈవో గోవిందరాజులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం అందుతున్న తీరుపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు ఇటీవల అందజేసిన నోట్ పుస్తకాలను పరిశీలించారు.ప్రతి విద్యార్థికి నోట్ పుస్తకాలను అందజేయాలని ఆదేశించారు.తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ ...

విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయులే అంతిమ రోల్ మోడల్ వ్యవహరించాలన్నారు. విద్యా జీవితంలో, విద్యార్థులు వివిధ రకాల ఉపాధ్యాయులను చూస్తారు. ఒక గొప్ప ఉపాధ్యాయుడు తన విద్యార్థుల పట్ల ఎల్లప్పుడూ మద్దతుగా ప్రతి అంశంలో విద్యార్థీ విజయాలను అభినందిస్తూ విద్యార్థులతో అమూల్యమైన అనుబంధాన్ని కలిగి ఉంటూ ఎల్లప్పుడూ ప్రోత్సహిచే ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితంలో  రోల్ మోడల్స్ గా అనుకరిస్తారన్నారు.తరగతి గదిలో శక్తివంతమైన విద్యా అందించడమే కాకుండా విద్యార్థుల సమస్యలను విని విలువైన నైపుణ్యాలను బోధించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మెరుగైన వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందన్నారు.ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల పై నమ్మకాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నారు.విద్యార్థులకు దినపత్రికలు పుస్తకాలను చదివే అలవాటు చేయాలన్నారు.