ఎంజేఅర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియకు శ్రీకారం

ఎంజేఅర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియకు శ్రీకారం
  • నియోజకవర్గంలోనీ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క యువతకు, ప్రజలకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ నమోదుకు అవకాశం
  • ప్రజల మేలు కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో లైసెన్స్ జారీ: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కేటియర్  జన్మదినం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు వాహన చోదకులకు తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సు  శిబిరాన్ని ప్రారంభించిన ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి.

ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడనికి అయ్యే ఆన్లైన్ రుసుమును తమ MJR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు,మిగతా ప్రాసెస్ మొత్తం రవాణా శాఖ నియమ నిబంధనలకు లోబడే ఎంపిక చేసి డ్రైవింగ్ లైసెన్స్ యువతి యువకులకు వాహన చోదకులకు,అందజేస్తామని తెలిపారు, మా ట్రస్ట్ ద్వారా కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని  నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని యువతీ యువకులు వాహన చోదకులు,సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, ధరకాస్తు ఫారాలు విడుదల చేసి యువతి యువకులకు ఆప్లికేషన్ ఫామ్ అందజేశారు,ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.