విద్యార్థుల మేధాశక్తిని సైన్స్  ఉపాధ్యాయులు వెలికి తీయాలి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

విద్యార్థుల మేధాశక్తిని సైన్స్  ఉపాధ్యాయులు వెలికి తీయాలి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జాతీయస్థాయి బాలల సైన్స్‌ కు ఎంపికైన విద్యార్థులు సురేష్, నాగమల్లయ్యల ప్రతిభ  అభినందించిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. డిసెంబ‌ర్ 5న‌ హైదరాబాద్‌ బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌లో నిర్వహించిన సైన్స్‌ కాంగ్రెస్‌లో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరూ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైన విద్యార్థులు సురేష్ కుమార్, నాగమల్లయ్యలను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.


ఆవు బూడిద, ఔషధ మొక్కల బూడిదతో కూరగాయలు మరియు ధాన్యం నిలువ సామర్థ్యాలను పెంచే విధంగా మరో విద్యార్థి రుబెటిక్ సహాయంతో బోరు బావుల్లో పడే చిన్నారులను తక్కువ ఖర్చుతో రక్షించే పరికరాల అనే అంశంలో రాష్ట్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఇందులో వెనిచర్ల పాఠశాల  విద్యార్ధి సురేష్ కుమార్‌, మారేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి నాగమల్లయ్య లు ప్రదర్శనిచ్చారు. ఈ ప్రదర్శనలు జాతీయస్థాయి 31వ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపిక కావడంతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో గైడ్ టీచర్ల సమక్షంలో విద్యార్థులను అభినందించారు.


జిల్లా కలెక్టర్ విద్యార్థుల రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి గైడ్ టీచర్ల రాజశేఖర్ రావు వెంకటాచారులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల మేధాస్తుకు పదును పెట్టేలా ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగాహన పెంపొందించాలని అందుకు అనుగుణంగా విద్యార్థుల ప్రదర్శనలను రూపొందించేలా తర్ఫీది ఇవ్వాలని సూచించారు. జాతీయస్థాయి సైన్స్ కాంగ్రెస్ లో మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థులను కలెక్టర్ అభినందిస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఉపాధ్యాయులు రాజశేఖర్ రావు వెంకటాచారి జాతీయ స్థాయికి బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైన విద్యార్థులు సురేష్ కుమార్ నాగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.