జ్యోతి రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి  డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి 

జ్యోతి రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి  డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: స్వయం కృషితో ఎదిగి అమెరికాలో స్థిరపడి వేలాది మందికి ఉద్యోగ ఉపాది కల్పిస్తున్నా  జ్యోతి రెడ్డిని ప్రతి విద్యార్ధి ఆదర్శంగా తీసుకోవాలని పిల్లల వైద్య నిపుణులు డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి అద్వర్యంలో  కళాశాలలోని  మూడు యూనిట్ల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులకు వరంగల్ కు చెందిన అమెరికాలో స్థిరపడిన జ్యోతి రెడ్డి మోటివేషన్ తరగతులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ వై.సత్యనారాయణమాట్లాడుతూ"అయినా నేను ఓడిపోలేదు ఏ అమ్మాయి ఓడిపోకూడదు"

అనే మాటలు ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మందికి ప్రేరణగా నిలిచాయని అటువంటి జ్యోతి రెడ్డి మాటలను, వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అమ్మాయిలు అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు. జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు దేన్నైనా సాధించగలుగుతారని స్వతంత్రంగా ఆలోచించాలని ఎవరిపైన ఆధారపడకుండా జీవితాన్ని గడపాలని ఆధారపడేటువంటి బ్రతుకును ఎవరు అంగీకరించకూడదని తమకున్న విల్ పవర్ తో దేనినైనా సాధించడానికి కష్టాలను ఎదుర్కొని సిద్ధంగా ఉండి ముందుకెళ్లాలని అన్నారు. జీవితంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్లను పడ్డటువంటి కష్టాలను విద్యార్థులకు తెలిపి విద్యార్థులు దేనికైనా సిద్ధంగా ఉండి ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.