డ్రగ్స్ మాఫియా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

డ్రగ్స్ మాఫియా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
  • నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే
  • ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామాలు చేయాలి 
  • BSP ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  బిజినాపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ బిజినాపల్లి మండల కేంద్రంలో అక్రమ డ్రగ్స్ దందా నడపటం దుర్మార్గం అనీ విమర్శించారు. పేదల, యువత ప్రాణాలతో చెలగాటం ఆడటం బిఆర్ఎస్ పార్టీకి అలవాటే అనీ దుయ్యబట్టారు. ఎన్నో రోజుల నుండి అక్రమ డ్రగ్స్ దందా నడుస్తుంటే, ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించ్చారు. నాగర్ కర్నూల్ లో బీహర్ ఆటవిక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. డ్రగ్స్ దందా వెనుక స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో కులానికి ఒక న్యాయం ఉండటం సిగ్గుచేటు అనీ గర్జించారు.

కోళ్ళ షెడ్డు రెడ్డి కులం వ్యక్తిది కాబట్టే, దర్యాప్తు నెమ్మదిస్తుందని తెలిపారు. కోళ్ళ షెడ్డు బహుజన కులాలకు చెందిన వ్యక్తులది ఐతే, ప్రభుత్వ యంత్రాంగం ఇలానే వ్యవహరించేదేనా అనీ నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంజేఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే యువత డ్రగ్స్ మత్తులో పడి కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారని తెలిపారు. బిఎస్పీ పార్టీ చాలా రోజుల  నుండి కల్తీ మాఫియా గురించి మొత్తుకుంటున్నా, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని  అన్నారు. ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ ను సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ఇ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ అంతటి నాగన్న, వనపర్తి జిల్లా అధ్యక్షులు చెన్నరాములు, అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్, మండల అధ్యక్షులు పీ. రామచందర్, నాయకులు బాలనాగులు, మల్లేష్, రాములు, ప్రసాద్, పరుశరాము, సంజయ్ లు పాల్గొన్నారు.