ప్రజా ప్రతినిధి అండతో కబ్జా

ప్రజా ప్రతినిధి అండతో కబ్జా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా:  జిల్లా కేంద్రంలో ని 15వ వార్డులో కౌన్సిలర్ అండ దండ లతో భూమిని అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్న కబ్జాకోరులు. 15 వ వార్డ్ లోని సర్వే నెంబర్ 264 గల మా భూమిని కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారు.ఈ భూమి పై కోర్ట్ నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్,మరియు మున్సిపాలిటీ లో కంప్లెయింట్ ఉన్నప్పటికీ...  కౌన్సిలర్ చెప్పిండు మేము ఇల్లు కట్టుకుంటామని ఈ భూమికి కొంతమేర పైసలు ఇచ్చామని చెప్తూ స్థానిక ఆడవాళ్లతో వారి బట్టలు వారే చించుకొని భయభ్రాంతులను గురిచేస్తూ చేస్తూ మా పై దాడికి దిగారు.

మా వద్ద అన్ని కాగితాలు ఉన్నప్పటికీ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా   నాయకుల అండదండలు చూసుకొని ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్   కట్టుకోమని సలహా ఇచ్చి కోట్లాటలు పెడుతున్నాడని కాలనీ వాసులు చెప్పుకుంటున్నారు.  కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న... అక్రమంగా చొరబడి కబ్జాలకు పాల్పడుతున్నా రక్షణ కల్పించాల్సిన వారు  పట్టించుకోవడం లేదు. దయచేసి మా గోడును మీడియా పెద్దలు పట్టించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంజెక్షన్ ఆర్డర్ నీ గౌరవించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ తక్షణమే స్పందించాలని కోరుతున్నాను.