ప్రధాన రాజకీయ పార్టీలు 60% ఎమ్మెల్యే సీట్లు బీసీలకే టికెట్లు కేటాయించాలి...

ప్రధాన రాజకీయ పార్టీలు 60% ఎమ్మెల్యే సీట్లు బీసీలకే టికెట్లు కేటాయించాలి...
  •  బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో సోమవారం రోజున బీసీ సంఘాల సమావేశంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు 60 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు, ఉదయపూర్ లో జరిగిన సమావేశంలో  రాహుల్ గాంధీ బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని డిక్లరేషన్ చేశారన్నారు, అదేవిధంగా మిగతా ప్రధాన రాజకీయ పార్టీలు జనాభా దమాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలని అన్నారు,  నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రాజకీయ పార్టీ బీసీలకే టికెట్ కేటాయించాలని అన్నారు,  ఒక సామాజిక వర్గానికి చెందిన కూచకుల్ల దామోదర్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ నుండి వీడి తన కొడుకుతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి టిక్కెట్టు ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అలాగే మరోవైపు నాగం జనార్దన్ రెడ్డి ఈ ఒక్కసారి  టికెట్ ఇచ్చి ఒక్క అవకాశం ఇవ్వాలని అంటున్నారు, ఎటు చూసినా వారి వర్గాలకు సంబంధించి ఎవరికో ఒకరికి టికెట్ కావాలని పోరాడుతున్నారు, 60 శాతం ఉన్న బీసీలు కూడా వాళ్లు పార్టీలు మారినా వారి వెంట వెళ్లకుండా ఉండాలని వాళ్లు మనల్ని ఇంకా జెండాలు మోసే  కార్యకర్తలుగానే చూస్తున్నారని బీసీ లంటే  ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పాల్గొని ఉత్సాహంగా పని చేస్తున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్వరలో రాబోతున్నారని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్  జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి అన్నారు, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు, మన బీసీల నుండి బీసీ అభ్యర్థి చట్టసభల్లో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి చెందటానికి ఇక్కడి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని అన్నారు, ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ల  నిరంజన్, రాము, సంగీత్, వంశీ, నాగరాజు, లక్ష్మయ్య తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.