బహిరంగ సభను విజయవంతం చేయాలి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బహిరంగ సభను విజయవంతం చేయాలి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ సంక్షేమ పథకాలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యాలయాలను మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు మెడికల్ కళాశాల పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్నారని వాటి అనంతరం జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడున్నర గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయం పార్టీ కార్యాలయం తో పాటు మెడికల్ కళాశాలను ప్రారంభించిన అనంతరం ఐదు గంటల 30 నిమిషాల నుండి భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుందని తెలిపారు.

బహిరంగ సభలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు హామీలను ప్రకటించనున్నారని గతంలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి జిల్లాను చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల వలసలు తగ్గాయని ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎమ్మెల్యేగా తాను బాధ్యతలు తీసుకోవడం వల్ల జిల్లా కేంద్రం ఏర్పాటుతోపాటు మెడికల్ కళాశాల మంజూరు అయిందని వివరించారు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యే దశలో ఉన్నాయని వీటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రానికి రావడం లేదని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అంకితం చేసేందుకు మాత్రమే రావడం జరుగుతుందన్నారు పట్టణంలో 65 కోట్లతో భూగర్భ డ్రైనేజీ మరియు 30 కోట్లతో సీసీ రోడ్లు 15 కోట్లతో స్టేడియం ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు అదే విధంగా ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఫుడ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కిరణ్ జడ్పిటిసి శ్రీశైలం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.