అభివృద్ధికి మళ్ళీ పట్టం కడదాం - కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి

అభివృద్ధికి మళ్ళీ పట్టం కడదాం - కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల: ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు,మండల పరిధిలోని సంపత్ రావు పల్లి, వల్లభాపురం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జూపల్లి హటావో కొల్లాపూర్ బచావో నినాదాలతో  సంపట్రావుపల్లి గ్రామస్తులు హోరెత్తించారు. కారు గుర్తుకు ఓటు వేసి,వేయించి అభివృద్ధి,సంక్షేమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే బీరం కోరారు.వివరించారు.సిఎం.కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ,ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని  ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని,మరొక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కొల్లాపూర్ ను మరింతగా అభివృద్ధి చేసుకుందాం అని.. కారు గుర్తుపైన ఓటు వేసి, వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను  కోరారు.కొల్లాపూర్ లో 20 ఏండ్ల నిరంకుశ పాలనకు - ప్రజాపాలనకు మధ్య జరిగే యుద్ధం అని అన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, మండల రైతు బంధుసమితి అధ్యక్షుడు మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, తూముకుంట సొసైటీ చైర్మన్ రామన్ గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,సర్పంచ్ రమేశ్వర్ రావు,తేజారెడీ,దామోదర్ రెడ్డి,సాయిరాం,సంజీవ,,వేణుమాధవ్ రెడ్డి తదితరులు ఉన్నారు.