సూర్యాపేటలో బిఆర్ఎస్ దూకుడు

సూర్యాపేటలో బిఆర్ఎస్ దూకుడు
  • నియోజకవర్గంలో నలుమూల కొనసాగుతున్న  చేరికల వెల్లువ 
  • కాంగ్రెస్ ,బిజెపిలకు గుడ్ బై చెప్తున్న నేతలు కార్యకర్తలు
  • దిక్కు తోచని స్థితిలో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు
  • భారీ మెజారిటీ లక్ష్యంగా దూసుకుపోతున్న బిఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ దూకుడు కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి విజయం ఖాయం అవడంతో , కాంగ్రెస్ బిజెపిలో చెందిన నేతలు కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరెందుకు క్యూ కడుతున్నారు. దీంతో తమ క్యాడర్ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు నానా పాట్లు పడుతుంటే బిఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్, మసాలా సైదులు నజీర్ చింతలపాటి శీను కప్పల సుమన్ నజీర్ తొ పాటు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. మరోవైపు తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన  భైరు మహేష్, రాజపురం నాగార్జున గౌడ్ మహేష్ గౌడ్ మక్తవత్ నాగమణి, రాపర్తి చందు రాపర్తి శ్రవణ్ రాచకొండ శ్రీకాంత్ భైరసాయి గోపగాని సాయి వినయ్,సుమన్ తో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. మరోవైపు  24 వ వార్డు బత్తుల జానీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మనోహర్, ఉపేందర్ ,మనీ ,వెంకన్న తో పాటు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడగా గులాబీ కండువాలు  కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు.

పెన్ పహాడ్ మండలం లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ను వీడి టిఆర్ఎస్ లో చేరిన సింగిరెడ్డిపాలెం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గులాబీ కండువా కప్పి సాధర స్వాగతం పలికిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎంపీపీ నెమ్మాది బిక్షం ఆధ్వర్యంలో చేరికలు భారీ ఎత్తున కొనసాగాయి.