బుద్దిస్ట్ మ్యూజియం భవన్ ప్రారంబానికి సిద్ధం చేయాలి.

బుద్దిస్ట్ మ్యూజియం భవన్ ప్రారంబానికి సిద్ధం చేయాలి.
  • పనుల్లో వేగం పెంచాలి.
  • జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-బుద్దిస్ట్ మ్యూజియం భవనాన్ని సర్వాంగ సుందరంగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. ఆదివారం నాగారం మండలం పణిగిరి లో నిర్మిస్తున్న బుద్దిస్ట్ భవన్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  దేశ, అంతర్జాతీయ బౌద్ధులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చి సందర్శించే విదంగా ఈ భవనాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతామని అన్నారు.  మ్యూజియం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు  తో పాటు అందమైన మొక్కలను నాటాలని  అదేవిదంగా గ్రామ పంచాయతీ ద్వారా  జంక్షన్ లో  లైటింగ్ తో పాటు మ్యూజియం వరకు వెళ్లే దారిలో లైటింగ్ పెంచనున్నట్లు తెలిపారు. మ్యూజియం పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించారు. భవనానికి క్వాలిటీ కలర్స్ వాడాలని తెలుపుతూ ఫెన్సింగ్ నిర్మాణం, బోర్ ఏర్పాటుకు  రూ. 6 లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 11 వరకు అన్ని పనులు పూర్తి చేసి 12న ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్కాలజీ శాఖ డి.డి. బి. నారాయణ, మ్యూజియం శాఖ డి.డి. పి. నాగరాజు, తహసీల్దార్ వి. బ్రహ్మయ్య, ఎంపీడీఓ జి. శోభారాణి సర్పంచ్ గట్టు నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు.