ఘనంగా సురేంద్రపురి రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 7వ వార్షికోత్సవం..

ఘనంగా సురేంద్రపురి రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 7వ వార్షికోత్సవం..
  • అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో  రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి  కళ్యాణం లోక ఫౌండేషన్ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో   అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డింగరి నరసింహ చారి, శ్రీనివాస్, మహేష్, శ్రావణ్ల ఆధ్వర్యంలో  గత మూడు రోజులుగా మొదటి శుక్రవారం  అమ్మవారికి అభిషేకం ,  గణపతి పూజ , అంకురార్పణ , తీర్థ గోష్టి  , ధ్వజారోహణం , యాగశాల ప్రవేశం , అగ్ని మధనం , దేవతాహ్వానం  , ద్వాదశ హారతులు , అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండవ రోజు శనివారం   వ్యాపార , ఉద్యోగ , విద్య , వివాహానికి ఇష్టికా , పాశుపత్రాస్ర హోమం , అమ్మవారికి శాఖంబరి అలంకారం , హారతి తీర్థ ప్రసాదం, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి మూలమంత్ర హోమం , అమ్మవారి ఊరేగింపు సేవ , ద్వాదశ హారతులు , పవళింపు సేవ , తీర్థ ప్రసాదం. మూడవ రోజు ఆదివారం అమ్మవారికి మహా కుంభాభిషేకం , అనంతరం శ్రీ జమదాగ్ని సమేత రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కళ్యాణ అనంతరం అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాల కరుణాకర్ గౌడ్ , బల్చి గురి లక్ష్మణ్ , కొలను రాజేందర్ , ఎల్లికారం నాగరాజు , మాటేటి రవీంద్రనాథ్ , కందుల జగన్నాథం , సురేందర్ , మల్లికార్జున్ , ఉట్కూరి భాస్కర్ గౌడ్ , బింగి పాండు , కే శ్రీనివాస్ , నవీన్ పాల్గొన్నారు.