జనావాసాల నడుమ నుండి హాని చేసే కంపెనీని తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం

జనావాసాల నడుమ నుండి హాని చేసే కంపెనీని తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలోని ఆర్.బి నగర్ లోగల బీడీలు, కారం , పసుపు అనే కుటీర పరిశ్రమలను తొలగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కి  కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటీర పరిశ్రమ వలన చుట్టుప్రక్కల జనాలకు ఆస్తమా , అలర్జీ , దురద , కళ్ళమంట వంటి శారీరక వ్యాధులు వస్తున్నాయని గతంలో అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కానీ వారు నామాత్రపు చర్యలు మాత్రమే తీసుకున్నారని కాలనీ ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి జనావాసాల నడుమ నుండి హాని చేసే కంపెనీని తొలగించి అట్టి కంపెనీని ఇండస్ట్రియల్ ఏరియాలోకి మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సమ్మ , నాయిని కృష్ణ , గుండు బాలమ్మ , కాలేవర్ రాదా బాయి , తాల్లాపల్లి పద్మ , గోవర్థన్ , సూరనేని మధుసూదన్ రావు , పెంట వరలక్ష్మి , కె.శైలేజ , కె. సుమ , బాలరాజు , కాలేవర్ శ్రీనివాస్ , శ్రీకాంత్ , గుండు క్రిష్ణా , కావ్య , రాజేష్  , కస్తూరి లక్ష్మీనారాయణ , నామల రాజు, నామల వెంకటేష్ , జమున , బోడ జయమ్మ  పాల్గొన్నారు.