ఎమ్మెల్యే మర్రిని తరిమికొట్టేందుకు ప్రజలను ఏకం చేస్తాం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :  దోపిడి దొంగగా మారిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఈ ప్రాంతం నుండి తరిమికొట్టేందుకు గ్రామాలలోని ప్రజలను ఏకం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ హెచ్చరించారు నియోజకవర్గం లోని వట్టెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా భూ నిర్వాసితులను పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం దారుణమని అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వేసిన పూలదండలను తీసుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేయడం దారుణమని గ్రామంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసుల పహారా లో కార్యక్రమాలు చేయడం కాదు దళిత బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుట్టలను మాయం చేసిన ఎమ్మెల్యే గ్రామాన్ని కూడా మాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దానిని తిప్పికొట్టేందుకు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే సహించేది లేదని హెచ్చరించారు గ్రామ గ్రామాన తిరిగి అవినీతి అరాచకాలను వివరిస్తూ గ్రామాలను ఏకం చేసి బిఆర్ఎస్ బొంద పెడతామని అన్నారు అనంతరం వారి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున నాయకులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది అనంతరం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.