ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టండి జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.

ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టండి జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశము లో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.... జిల్లా ప్రజలకు కావలసిన ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయని, కొత్త రీచ్ లను ప్రజల అవసరాల రిత్యా అందుబాటులోకి తీసుకురావాలని , ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆయా శాఖ అధికారుల ను ఆదేశించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరగకుండా అరికట్టవలసిన బాధ్యత పోలీస్ శాఖదే అని తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించుక పోయే ట్రాక్టర్లను, ట్రీప్పర్లను సీజ్ చేయాలని, అట్టి వాహన యజమానులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుకను తరలించుకుపోయే వాహనాలను గుర్తించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.

ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మైన్స్ శాఖ అధికారుల నుండి ఇప్పటివరకు జిల్లాలో గల రీచ్ ల నుంచి తీసిన ఇసుక, మిగతా బ్యాలెన్స్, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలించే వాహనాలను నిర్దిష్ట సమయాలలోనే అనుమతించాలని పోలీస్ శాఖను కు  స్పష్టం చేసినారు. ఇసుక తరలింపుకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.  ఇసుక తరలించే వాహనాలలో రసీదులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఓవర్ లోడ్ తో వెల్లే ట్రిప్పర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేసించినారు. ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, మైన్స్ ఏ.డి  సాంబశివరావు, డీఎస్పీలు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.