బలహీన వర్గాల హక్కుల రక్షణలో బీఆర్ఎస్ విఫలం.

బలహీన వర్గాల హక్కుల రక్షణలో బీఆర్ఎస్ విఫలం.
  • చట్టాన్ని సాకుగా చూపి ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయకుండా మహిళల పై వివక్ష
  • జ్యోతి బాపులే స్ఫూర్తిగా ఖాళీ అయిన స్థానాలు ఎందుకు భర్తీ చేయలేదు
  • ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బలహీన వర్గాల హక్కుల రక్షణలో బీఆర్ఎస్ విఫలం అయిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చట్టాన్ని సాకుగా చూపి ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయకుండా మహిళల పై వివక్ష చూపుతున్నారని అన్నారు. జగిత్యాల మండల పరిషత్ ఛైర్పర్సన్ మరణంతో  అధ్యక్ష పదవి ఖాళీ అవగా,  జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ రాజీనామా చేయడం తో ఖాళీ ఏర్పడిందని, మండల పరిషత్ అధ్యక్ష పదవిలో  భర్తీ చేయకపోవడంతో మూడు సంవత్సరాలు, మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో ఏడాది కాలంగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కొనసాగుతున్నారని అన్నారు. ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయక పోవడంతో మహిళలకు కేటాయించిన రిజర్వేషన్, హక్కులు కోల్పోతున్నారని ఇది  మహిళల పై వివక్ష చూపడమేనని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కెసిఆర్,కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు చట్టంలో మార్పు  చేయించి, మున్సిపల్ ఛైర్పర్సన్, మండల పరిషత్ లో అధ్యక్ష స్థానం ఎందుకు భర్తీ చేయలేదు. బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ స్థానిక ప్రజా ప్రతినిధుల బాధ్యత అని అన్నారు.జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ , జగిత్యాల రూరల్ మండల పరిషత్ లో బీఆర్ ఎస్ ఆధిక్యం ఉండి కూడా బలహీన వర్గాలకు కేటాయించిన స్థానం భర్తీ చేయాలనే ఆలోచన ఎమ్మేల్యేకు లేదన్నారు. సామాజిక వెనకబాటుతనాన్ని ఆధారంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లలో ఉన్నత వర్గం అధికారం అనుభవిస్తుంటే  ఇన్నాళ్లు ఎం చేశారు. ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడితే, వైస్ ఛైర్మన్ ఎలా కాపాడాలని ఎమ్మెల్యే ఆలోచించారే తప్ప బలహీన వర్గాల హక్కుల రక్షణ కోసం చొరవ చూపి, ఖాళీ అయిన స్థానాలు భర్తీ  చేసేందుకు చొరవ తీసుకొలేదన్నారు.జ్యోతి బాపులే విగ్రహం పెట్టాలని చెబుతున్న వారు మహిళలకు కేటాయించిన హక్కులు కల్పించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ఇదే నా మీ జ్యోతి బాపులే స్ఫూర్తి అని బీ ఆర్ ఎస్ నాయకులను  నిలదీశారు. చైర్ పర్సన్, మండల పరిషత్ అధ్యక్ష పదవి భర్తీ చేయకుండ అడ్డుగా ఉన్న నిబందలను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెల్లగానే, మార్పులు. చేయాలని అధికారులను ఆదేసించి మార్పు చేశారని ప్రజాస్వామ్య ప్రక్రియని నిలబెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలోమహిళ కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులూ గిరి నాగభూషణం, కొత్త మోహన్, బండ శంకర్, మన్సూర్ , కల్లపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, షేక్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.